Home  »  TV News  »  Jayam serial: పగతో రగిలిపోతున్న వీరు.. ఇషిక, సూర్యల మధ్య చిచ్చుపెట్టిన రంగా!

Updated : Mar 27, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -227 లో... పెద్ద సారుని కలవడానికి ఒకతను వస్తాడు. పెద్దసారు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతుంటే రుద్ర ఆపుతాడు. ఒక ఫోటో చూపించి అతని గురించి రుద్ర అడుగుతాడు. అతను నాగభూషణం మీ పెద్ద నాన్నని చంపాలని ట్రై చేసాడని అతను చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. అతనితో పాటు గంగ, రంగా కూడా ఉంటారు. 

అతను వెళ్ళిపోయాక ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ నాగభూషణం ఎవరో వాడిని తలుచుకుంటేనే భయం వేస్తుందని గంగ అంటుంది. నాగభూషణం ఎవరో కాదు వీరు వాళ్ళ నాన్న అని రుద్ర చెప్పగానే గంగ, రంగా షాక్ అవుతారు. వాళ్ళ నాన్న మా పెద్దనాన్న వల్లనే చనిపోయాడని కుటుంబంపై పగ పట్టాడని రుద్ర వాళ్ళకి చెప్తాడు. 

ఆ తర్వాత వీరు ప్లాన్ చేసి పంతులు ని ఇంటికి రప్పిస్తాడు. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను.. అది మా మావయ్య గారి పేరున పెట్టాలని అనుకుంటున్నానని, మా మావయ్య పేరున ఎలా ఉందో చెప్పండి పంతులు అని వీరు అడుగుతాడు. పంతులుకి వీరు సైగ చెయ్యడం రుద్ర చూస్తాడు. మీ మావయ్య గారి పేరున అసలు బాలేదు.. ఇదివరకు ఈ ఇంట్లో మీ అబ్బాయికి జరిగినట్లే జరిగే సూచనలున్నాయనగానే అందరు టెన్షన్ పడుతారు. 

ఇదంతా మీ అబ్బాయి భార్య జాతకం వల్లే.. ఇప్పుడు ఆమె దోషం వల్లే.. ఈ ఇంటికి ఇలా జరుగుతుందని పంతులు చెప్తాడు. దాంతో శకుంతల టెన్షన్ పడుతుంది. మీరు దానికి పరిష్కారం ఏంటో చెప్పండి అని వీరు అడుగగా హోమం చెయ్యాలని పంతులు చెప్తాడు. అవన్నీ నేను నమ్మనని పెద్దసారు పంతులిని పంపిస్తాడు. 

ఆ తర్వాత అదంతా వీరు ప్లాన్ అని రుద్ర, గంగ, రంగా అనుకుంటారు. ఆ తర్వాత ఇషిక, వీరు ప్లాన్ సక్సెస్ అని నవ్వుకుంటారు. అదంతా గంగ రంగా చూసి ఇషికకి బుద్ది చెప్పాలని అనుకుంటారు.

ఆ తర్వాత ఇందుమతి దగ్గరికి రంగా వెళ్లి ఈ ఇంటికి సంబంధించిన బిజినెస్ చూసుకోవడానికి అందరున్నారు. మరి సూర్య తర్వాత ఆ బిజినెస్ చూసుకోవడానికి ఎవరున్నారు.. వారసులు ఉండాలి కదా అయిన ఆ ఇషికకి పిల్లలు ఇష్టమే లేదని రంగా అంటుంటే ఇందుమతి రెచ్చిపోయి ఇషిక దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటుంది. అప్పుడే రాఘవ, సూర్య వస్తారు. నాకు మనవడో మనవరాలో కావాలని ఇందుమతి అనగానే నాకు కొంచెం టైమ్ కావాలి.. సెటిల్ అవ్వాలని ఇషిక కోప్పడుతుంది. 

మా అమ్మ అన్నదాంట్లో తప్పేముంది. నువ్వు ఎప్పుడైనా భార్యగా నడుచుకున్నావా అని సూర్య కోప్పడతాడు. నాకు సంవత్సరం లోపు మనవడినో, మనవరాలినో ఇవ్వకుంటే నీకు డైవర్స్ ఇస్తామని ఇందుమతి అనగానే ఇషిక షాక్ అవుతుంది. అదంతా చూసి రంగా, గంగ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.